పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలమ్మ  - Nirmala sitharaman meets President before budget speech
close

Updated : 01/02/2021 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలమ్మ 

దిల్లీ: కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బృందం పార్లమెంట్‌కు బయల్దేరింది. అంతకుముందు  ఈ బృందం ఆర్థికశాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతిభవన్‌కు చేరుకుంది. ప్రొటోకాల్‌ ప్రకారం దేశ ప్రథమపౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్‌ గురించి వివరించారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 

కరోనా దృష్ట్యా ఈ సారి బడ్జెట్‌ ప్రసంగం కాగితరహితంగా ఉండనుంది. ఇందుకోసం నిర్మలమ్మ సంప్రదాయ బాహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు బయల్దేరారు. సభ్యులకు బడ్జెట్‌ సాఫ్ట్‌కాపీలు ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి..

బడ్జెట్‌ ‘ట్యాబ్‌’తో నిర్మలమ్మ

నిర్మలమ్మ ముందు సవాళ్లెన్నో..


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని