SBI home loan: వినియోగ‌దారుల‌కు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ - SBI waives off processing fee on home loans this Monsoon Dhamaka Offer ending on 31st August 2021
close

Updated : 02/08/2021 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SBI home loan: వినియోగ‌దారుల‌కు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మాన్‌సూన్ థ‌మ‌కా ఆఫ‌ర్ కింద గృహ రుణాల‌పై ప్రాసెసింగ్ ఛార్జీలను నూరు శాతం ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ప్ర‌స్తుతం 0.40 శాతంగా ఉన్న ప్రాసెసింగ్ ఫీజు భారం వినియోగదారులకు తగ్గనుంది. అయితే ఈ ఆఫ‌ర్ ప‌రిమిత కాలం వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నుంది. ఆగ‌స్టు 31తో ఈ ఆఫ‌ర్ ముగుస్తుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

అంతేకాకుండా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆఫ‌ర్ కింద 5 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) అద‌న‌పు వ‌డ్డీ రాయితీని అందిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ పేర్కొంది. మ‌హిళ‌ల‌కు మ‌రో 5 బేసిస్ పాయింట్లు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ గృహ‌రుణ ప్ర‌స్తుత‌ ప్రారంభ వ‌డ్డీ రేటు 6.70 శాతంగా ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని