close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శాంసంగ్‌ నుంచి రెండు బడ్జెట్‌ ఫోన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌.. భారత్‌లో కొత్తగా రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ M11, గెలాక్సీ M01 పేరిట ఈ ఫోన్లను తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో దూసుకెళ్తున్న చైనా కంపెనీలకు పోటీగా శాంసంగ్‌ ఈ రెండు ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లు ఏంటి? ధరెంత? వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం..

M11 ధర.. ఫీచర్లు

శాంసంగ్‌ M11 రెండు వేరియంట్లలో వస్తోంది. 3జీబీ/32 జీబీ ధరను రూ.10,999గా, 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గానూ కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ, వయలెట్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. ఆండ్రాయిడ్‌ 10తో పనిచేసే వన్‌యూఐ 2.0తో వస్తోంది. 6.4  అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌ను వాడారు. వెనుక వైపు 13+5+2 ఎంపీ కెమెరాలను వినియోగించారు. ముందువైపు 8 ఎంపీ కెమెరాను వాడారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 15W ఫాస్ట్‌ఛార్జింగ్ సదుపాయం ఉంది.

M01 ధర.. ఫీచర్లు

M01 కేవలం 3జీబీ/32జీబీ వేరియంట్‌లో మాత్రమే వస్తోంది. బ్లాక్‌,బ్లూ,రెడ్‌ కలర్స్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 10తో కూడిన వన్‌యూఐ 2.0తో పనిచేస్తుంది 5.71 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ V డిస్‌ప్లేను వాడారు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుక వైపు రెండు కెమెరాలు (13+2) అమర్చారు. సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. ఇందులో 4,000 బ్యాటరీ ఉంది. ఫాస్ట్‌ఛార్జింగ్‌ సదుపాయం మాత్రం లేదు. ఈ రెండు ఫోన్లూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ ఇండియా ఈ-స్టోర్‌లో జూన్‌ 2 నుంచి లభ్యం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లోనూ వీటి విక్రయాలు జరుగుతాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.