Stock Market: కొనసాగిన లాభాల జోరు.. సరికొత్త శిఖరాలకు సూచీలు! - Sensex raises over 450 pts
close

Published : 18/10/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: కొనసాగిన లాభాల జోరు.. సరికొత్త శిఖరాలకు సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సానుకూలతలు సూచీలను ముందుకు నడిపించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధిరేటు, త్రైమాసిక ఫలితాలు, పండగ సీజన్ విక్రయాలు సహా వ్యాక్సినేషన్‌, కరోనా అదుపులో ఉండడం వంటి సానుకూల వాతావరణం సూచీలను ముందుకు నడిపిస్తోంది. అలాగే కీలక రంగాల్లో కొనుగోళ్లు సూచీల పరుగుకు దోహదం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు జీవితకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిందన్న వార్తల నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. 

ఉదయం సెన్సెక్స్‌ 61,817.32 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజులో 61,963 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 450.53 పాయింట్ల లాభంతో 61,756.48 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,543 - 18,445 మధ్య కదలాడి చివరకు 138.05 పాయింట్ల లాభంతో 18,476.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.32 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌ షేర్లు రాణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని