వరుస లాభాలకు బ్రేక్‌ - Sensex slips 260 points
close

Updated : 06/01/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుస లాభాలకు బ్రేక్‌

ముంబయి: దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో పది రోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్తున్న సూచీలకు బ్రేక్‌ పడినట్లయ్యింది. ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఉదయం 48,504 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గానే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు 500 పాయింట్ల మేర నష్టాల్లోకి వెళ్లింది. చివరికి 263.72 పాయింట్ల నష్టంతో 48,174.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53.25 పాయింట్ల నష్టంతో 14,146.25 వద్ద నిలిచింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.11గా ఉంది. నిఫ్టీలో ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, శ్రీ సిమెంట్స్‌, గెయిల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి.

ఇవీ చదవండి..
మార్కెట్లోకి మళ్లీ టాటా సఫారీ
ఇల్లు కొనేందుకు న‌గ‌దా ? లేక రుణ‌మా ?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని