స్టాక్‌ మార్కెట్లకు ఐటీ అండ - Sensex up by 100 pts
close

Published : 12/02/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్లకు ఐటీ అండ

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 83 పాయింట్ల లాభంతో 51,614 వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైంది. నిఫ్టీ 13 పాయింట్లు ఎగబాకి 15,186 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 98 పాయింట్లు లాభపడి 51,629 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 15,201 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 225 సూచీ నష్టాల్లో కొనసాగుతుండగా.. హాంకాంగ్‌ హెంగ్‌ సెంగ్‌, చైనా ఎస్‌ఎస్‌ఈ కంపోజిట్‌ ఇండెక్స్‌ లాభాల్లో పయనిస్తున్నాయి. ఐటీ రంగ షేర్లు దూసుకెళుతుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, విప్రో లిమిటెడ్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐటీసీ లిమిటెడ్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, గెయిల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని