Stock Market: కొనసాగుతున్న లాభాల జోరు - Stock Market indices trading Higher
close

Published : 25/05/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: కొనసాగుతున్న లాభాల జోరు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసుల తగ్గుముఖం, కీలక రంగాల షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. మంగళవారం ఉదయం 9:25 గంటల సమయంలో  సెన్సెక్స్‌ 238 పాయింట్లు లాభపడి 50,905 వద్ద.. నిఫ్టీ 85 పాయింట్లు ఎగబాకి 15,283 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.86 వద్ద ట్రేడవుతోంది.

కీలక రంగాల సూచీలన్నీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ 30 సూచీలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌ ఎన్‌టీపీ, హెచ్‌యూఎల్‌ కంపెనీల షేర్లు లాభాలు ఒడిసిపడుతున్న జాబితాలో ముందున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని