Stock market: ఫ్లాట్‌గా కదలాడుతున్న సూచీలు - Stock Markets Are opening low
close

Updated : 16/06/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఫ్లాట్‌గా కదలాడుతున్న సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 11 పాయింట్ల నష్టంతో 52,761 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 06 పాయింట్లు దిగజారి 15,862 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.35 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు కొరవడడంతో ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. మరోవైపు గత నాలుగు సెషన్ల వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పవర్‌ గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, రిలయన్స్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని