Stock market: లాభాల్లో సూచీలు - Stock markets are in green
close

Published : 05/07/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 288 పాయింట్ల లాభంతో 52,773 వద్ద.. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 15,806 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.50 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు మాత్రమే నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని