వరుసగా రెండో నెలా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం - WPI inflation rises in Feb
close

Published : 15/03/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా రెండో నెలా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) వరుసగా రెండో నెలా పెరిగింది. ఫిబ్రవరి నెల డబ్ల్యూపీఐ 4.17 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు, ఇంధన, విద్యుత్తు ధరలు పెరగడమే ఇందుకు కారణం. జనవరిలో ఈ సూచీ 2.03 శాతంగా ఉంది. ఇక 2020, ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.26 శాతంగా రికార్డయింది. 

ఇతర కీలకాంశాలు...

* ఆహార ద్రవ్యోల్బణం 1.36 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది మైనస్‌ 2.8 శాతంగా ఉంది. 
* కూరగాయల ద్రవ్యోల్బణం మైనస్‌ 2.90 వద్ద నిలవగా.. జనవరిలో ఇది మైనస్‌ 20.82గా రికార్డయింది.
* తృణధాన్యాల ధరలు ఫిబ్రవరిలో 10.25 శాతం మేర పెరిగాయి. పండ్ల ధరలు 9.48 శాతం ఎగబాకాయి.
* ఇంధన, విద్యుత్తు రంగంలో ద్రవ్యోల్బణం మైనస్‌ 0.58 శాతంగా నమోదైంది.

మరోవైపు శుక్రవారం వెలువడిన ఆహార వస్తువుల ధరలు పెరగడంతో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో మూడు నెలల గరిష్ఠమైన 5.03 శాతానికి చేరిన విషయం తెలిసిందే. అలాగే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ క్షీణించింది. యంత్ర పరికరాలు, తయారీ, గనుల తవ్వక రంగాల్లో ఉత్పత్తి తగ్గడంతో జనవరిలో ఈ సూచీ 1.6 శాతం మేర డీలా పడింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని