close
Array ( ) 1

తాజా వార్తలు

 పీఎన్‌బీ, ఐఓబీ రుణ రేట్లలో 0.75% కోత

ముంబయి: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ)లు మంగళవారం తన రుణ రేట్లలో 75 బేసిస్‌ పాయింట్ల (0.75%) మేర కోత వేశాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఆర్‌బీఐ రెపో రేటులో 75 బేసిస్‌ పాయింట్ల మేర గత వారం కోత వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం చోటు చేసుకుంది. చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో రేట్ల కోత ప్రయోజనాలను బదిలీ చేశాయి. రిటైల్‌, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) వంటి రుణ స్వీకర్తలకు ఈ కోత వర్తిస్తుందని పీఎన్‌బీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఓబీ కూడా రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)లో 0.75 శాతం తగ్గించింది. దీంతో కొత్త ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ప్రస్తుత స్థాయి 8 శాతం నుంచి 7.25 శాతానికి పరిమితం అయింది.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.