close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికా మార్కెట్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌: యూఎస్‌ మార్కెట్లో ఓటీసీ (ఓవర్‌ ద కౌంటర్‌) విభాగంలో నికోటిన్‌ పొలాక్రిలెక్స్‌ లోజెంజెస్‌ ఔషధాన్ని విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. 2ఎంజీ, 4ఎంజీ డోసుల్లో ఈ ఔషధాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొంది. జీఎస్‌కే హెల్త్‌కేర్‌కు చెందిన నికోరెట్టే లోజెంజెస్‌ అనే బ్రాండుకు ఇది జనరిక్‌ ఔషధం. మార్కెట్‌ పరిశోధన సేవల సంస్థ అయిన ఐఆర్‌ఐ గణాంకాల ప్రకారం..., గత ఏడాది కాలంలో ఈ ఔషధం యూఎస్‌ మార్కెట్లో 200 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను నమోదు చేసింది. పొగ తాగే అలవాటు ఉన్నవారు ఆ జాడ్యం నుంచి బయటపడటానికి ఈ ఔషధం వీలుకల్పిస్తుంది. సంక్లిష్టమైన ఔషధాలను తాము తయారు చేయగలమనటానికి యూఎస్‌ మార్కెట్లో దీనిని విడుదల చేయటమే ఉదాహరణగా డాక్టర్‌ రెడ్డీస్‌ ఉత్తర అమెరికా జనరిక్స్‌ విభాగం సీఈఓ మార్క్‌ కికుచి అన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.