close

Updated : 20/01/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇ-కామర్స్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల సవరణ!

దిల్లీ: దేశంలో అమెజాన్‌, వాల్‌మార్ట్‌ (ఫ్లిప్‌కార్ట్‌) వ్యాపార విధానాల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని సంప్రదాయ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఇ-కామర్స్‌ రంగ  విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల్లో మళ్లీ సవరణలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఇ-కామర్స్‌లో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. వాస్తవానికి కొనుగోలుదార్లు, విక్రయదార్లకు మధ్య మార్కెట్‌ ప్లేస్‌గా మాత్రమే విదేశీ ఇ-కామర్స్‌ సంస్థలు వ్యవహరించాల్సి ఉంది. ఈ సంస్థలు నిల్వలను కలిగి ఉండి, తమ ప్లాట్‌ఫామ్‌పై నేరుగా విక్రయించ కూడదు. ఏదేని విక్రయ సంస్థలో ఇ-కామర్స్‌ సంస్థ ఈక్విటీ వాటా కలిగి ఉంటే, ఆ సంస్థ ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంపై ఇ-కామర్స్‌ సంస్థలు విక్రయించకుండా 2018లో ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఒక విక్రయ సంస్థలో ఇకామర్స్‌ మాతృసంస్థ లేదా మరో రూపేణా పరోక్షంగా వాటా కలిగి ఉన్నా కూడా, ఆ సంస్థ ఉత్పత్తులను విక్రయించకుండా ఆంక్షలు విధించాలని ప్రభుత్వం తాజాగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని