కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం
close

Published : 12/05/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం

భారత్‌లో కొవిడ్‌ ఉపశమన చర్యలకు 15 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.110 కోట్లు) సాయాన్ని ట్విటర్‌ ప్రకటించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వేతర సంస్థలైన కేర్‌, ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏలకు వితరణగా అందించనుంది.
పేటీఎం ఫౌండేషన్‌ ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ సహా 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను గుజరాత్‌కు అందించనున్నట్లు తెలిపింది.
గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నెలాఖరులోపు 7 ఆక్సిజన్‌ ప్లాంట్లను డీసీఎమ్‌ శ్రీరామ్‌  ఏర్పాటు చేయనునుంది.
దిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఆక్సిజన్‌ సరఫరా సహా సంబంధిత పరికరాలను కూడా అందిస్తామని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఫౌండేషన్‌ తెలిపింది.
టెలికాం పరిశ్రమ సమాఖ్య కాయ్‌ ఫ్రంట్‌లైన్‌ టెలికాం కార్మికులకు ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్‌ ఇప్పించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించింది.
దిల్లీ ప్రభుత్వానికి మద్దతుగా 12,000 ఆక్సిజన్‌ సిలిండర్లతో సహా 21 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హెచ్‌సీఎల్‌ ముందుకొచ్చింది.
భాగస్వామ్య హోటళ్లలోని సిబ్బంది టీకాలు వేయించుకున్న స్థితిని ఓయో తమ యాప్‌లో చూపించడం ద్వారా ఖాతాదార్లకు నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది.
లివింగార్డ్‌ ఏజీ కొవిడ్‌పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారికి రూ.15 కోట్ల విలువైన యాంటీవైరల్‌ మాస్కుల్ని అందించనున్నట్లు తెలిపింది.
ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా భారత్‌లో కొవిడ్‌ పోరుకు 2,50,000 డాలర్ల (సుమారు రూ.1.8 కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని