క్రమం తప్పని ఆదాయం వచ్చేలా..
close

Updated : 16/07/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రమం తప్పని ఆదాయం వచ్చేలా..

జీవితంలోని పలు దశల్లోని ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా రాబడి వచ్చేలా చూసుకోవాలని అనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని, ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఒక వినూత్న పాలసీని తీసుకొచ్చింది. క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించడంతోపాటు, హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలను అందించే ఈ పాలసీ పేరు ఎక్సైడ్‌ లైఫ్‌ గ్యారంటీడ్‌ వెల్త్‌ ప్లస్‌. ఇది నాన్‌ పార్టిసిపేటింగ్‌, వ్యక్తిగత జీవిత బీమా, పొదుపు పథకం. వినియోగదారుల అవసరాలను బట్టి, దీన్ని రెండు రకాలుగా ఎంచుకునే వీలుంది.

ఇన్‌కం ఆప్షన్‌ కింద పాలసీదారులు ఆరేళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత 30 ఏళ్లపాటు హామీతో కూడిన స్థిరమైన చెల్లింపులను పొందేందుకు వీలుంటుంది. అదనంగా మెచ్యూరిటీ తర్వాత పాలసీదారులు తాము చెల్లించిన ప్రీమియం మొత్తాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. పిల్లల చదువులు, వివాహం తదితర అవసరాల కోసం నగదు కావాలనుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపికం చేసుకోవచ్చు. మరో ఆప్షన్‌లో పాలసీదారులు ఆరేళ్లపాటు ప్రీమియం చెల్లిస్తే.. నిర్ణీత వ్యవధి తర్వాత మెచ్యూరిటీ ప్రయోజనాలను ఏకమొత్తంలో పొందవచ్చు. అదే సమయంలో ఈ వ్యవధిలో జీవిత బీమా రక్షణా లభిస్తుంది. ఈ పాలసీని తీసుకునేందుకు కనీస వయసు 3 ఏళ్లు. గరిష్ఠంగా 60 ఏళ్ల వారి వరకూ దీన్ని ఎంచుకోవచ్చు. ఇన్‌కం ఆప్షన్‌ ఎంచుకునే వారికి కనీస వయసు 11 ఏళ్లు ఉండాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని