నిధుల సమీకరణలో గాయత్రీ ప్రాజెక్ట్స్‌
close

Published : 25/07/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిధుల సమీకరణలో గాయత్రీ ప్రాజెక్ట్స్‌

ఈనాడు, హైదరాబాద్‌:  గాయత్రీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ మూలధన నిధుల సమీకరణ యత్నాల్లో నిమగ్నమైంది. నిధులు సమకూర్చడానికి ఒక విదేశీ సంస్థ ఆసక్తి చూపుతోందని, ఆ సంస్థతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు గాయత్రీ ప్రాజెక్ట్స్‌ బీఎస్‌ఈకి వెల్లడించింది. వచ్చే 90 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అనుకున్నట్లు నిధులు లభిస్తే, ఆ సొమ్మును వ్యాపార కార్యకలాపాల విస్తరణకు. అప్పులు తీర్చడానికి కేటాయించనున్నట్లు వివరించింది. దీర్ఘకాలిక రుణాన్ని తీర్చివేయాలని గాయత్రీ ప్రాజెక్ట్స్‌ యాజమాన్యం కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన దీర్ఘకాలిక రుణ భారాన్ని 25 శాతం మేరకు తగ్గించుకోవడం గమనార్హం. వచ్చే రెండేళ్లలో పూర్తిగా అప్పు తీర్చివేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం సమీకరించే నిధులతో కొంత అప్పు తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని