సంక్షిప్తవార్తలు
close

Updated : 23/09/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్తవార్తలు

బాండ్లకు నేడు వడ్డీ చెల్లిస్తాం: ఎవర్‌గ్రాండ్‌

బీజింగ్‌: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి, ప్రపంచ మార్కెట్లలో కలవరం సృష్టించిన చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ ‘బాండ్ల రూపంలో సమీకరించిన నిధులకు గురువారం వడ్డీ చెల్లిస్తామ’ని బుధవారం వెల్లడించింది. ఈ ప్రకటన మదుపర్లకు ఊరట కలిగించింది. ఒకవేళ కంపెనీకి ఉన్న 31,000 కోట్ల డాలర్ల రుణాలను పునర్‌వ్యవస్థీకరిస్తే, బ్యాంకులు-బాండ్‌హోల్డర్లు భారీ మొత్తాల్ని కోల్పోతారని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. బాండ్లపై 400 కోట్ల యువాన్‌ల (62 కోట్ల డాలర్ల) వడ్డీని గురువారం చెల్లించనున్నట్లు ఎవర్‌గ్రాండ్‌ తెలిపింది. ఈ బాండ్లకు వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంది.


పబ్లిక్‌ ఇష్యూకు ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా

ఈనాడు, హైదరాబాద్‌: మన్నికైన వినియోగ వస్తువులను విక్రయించే ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ను నిర్వహించే రిటైల్‌ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా రూ.500 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఇందులో రూ.138.8 కోట్లను విస్తరణ కోసం వినియోగించనుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ 90కి పైగా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తోంది. కిచెన్‌ స్టోరీస్‌ పేరుతో ప్రత్యేకంగా వంటగది అవసరాల కోసం రెండు కేంద్రాలున్నాయి. ఇలాంటి ప్రత్యేక స్టోరును ఆడియా, హోం ఆటోమేషన్‌ విభాగంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌: పైపులు, ట్యూబులు, మైల్డ్‌ స్టీల్‌, సౌర విద్యుత్‌ పరికరాలను ఉత్పత్తి చేసే హైదరాబాద్‌కు చెందిన హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీఓ) రానుంది. 85 లక్షల ఈక్విటీ షేర్ల జారీకి సెబీకి దరఖాస్తు చేసింది. దీని ద్వారా రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సమీకరించాలని సంస్థ భావిస్తోంది. ఈ సంస్థ తెలంగాణలోని సంగారెడ్డిలో 51,943 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.


ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ

5 నుంచి ఒక్కో షేరు ధర రూ.535

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ రూ.21,000 కోట్ల రైట్స్‌ ఇష్యూ అక్టోబరు 5న ప్రారంభమై, 21న ముగియనుంది. ఈ ఇష్యూలో పాల్గొనేందుకు, మదుపర్లు తమ ఖాతాలో ఎయిర్‌టెల్‌ షేర్లు కలిగి ఉండేందుకు (రైట్స్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌) ఈ నెల 28ని రికార్డు తేదీగా నిర్ణయించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. రైట్స్‌ ఇష్యూలో ఒక్కో షేరుకు ప్రీమియంతో కలిపి రూ.535గా ధరను నిర్ణయించింది. అర్హులైన వాటాదార్లు ప్రతి 14 షేర్లకు ఒక షేరును రైట్స్‌ ఇష్యూ ద్వారా పొందే అవకాశం కల్పించింది. కంపెనీలో ప్రమోటర్‌ వాటా     55.8 శాతం ఉండగా, పబ్లిక్‌ వాటా 44.09 శాతంగా ఉంది.Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని