మనీశ్‌ మల్హోత్రాతో రిలయన్స్‌ జట్టు
close

Published : 17/10/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనీశ్‌ మల్హోత్రాతో రిలయన్స్‌ జట్టు

ఎమ్‌ఎమ్‌ స్ట్రైల్స్‌లో 40% వాటా కొనుగోలు

ముంబయి: ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రాతో రిలయన్స్‌ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మనీశ్‌కు చెందిన ఎమ్‌ఎమ్‌ స్ట్రైల్స్‌లో 40 శాతం వాటాను రిలయన్స్‌ బ్రాండ్స్‌ (ఆర్‌బీఎల్‌) కొనుగోలు చేస్తుంది. మనీశ్‌ కంపెనీలోకి బయటి నుంచి వచ్చిన తొలి పెట్టుబడి ఇదే కావడం గమనార్హం. ఇప్పటిదాకా కంపెనీ పూర్తిగా మనీశ్‌ చేతిలోనే(ప్రైవేట్లీ హెల్డ్‌) ఉంది. 2005లో ‘మనీశ్‌ మల్హోత్రా’ పేరిట ఏర్పాటైన బ్రాండ్‌కు ముంబయి, దిల్లీ, హైదరాబాద్‌లలో లగ్జరీ రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. ఒక వర్చువల్‌ స్టోర్‌ కూడా ఉంది. మొత్తం మీద వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ బ్రాండ్‌కు 1.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 31 ఏళ్లుగా మల్హోత్రా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బ్రాండ్‌ కోసం 700 మంది కళాకారులు, వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద విలాసవంతమైన రిటైలర్‌ అయిన ఆర్‌బీఎల్‌లో మరో బ్రాండ్‌ చేరినట్లయింది. ‘అంతర్జాతీయంగా భారత డిజైనర్‌ దుస్తులకు మంచి పేరుంది. మనీశ్‌తో మా ప్రయాణాన్ని కొనసాగించడం మాకు ఆనందంగా ఉంద’ని రిలయన్స్‌ రిటైల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ పేర్కొంది. ‘రిలయన్స్‌కున్న వివేకవంతమైన దృష్టి, ఆ కుటుంబానికి సంప్రదాయాలు, కళలపై ఉన్న అభిరుచి కారణంగానే ఈ భాగస్వామ్యం సాధ్యమైంది. మా బ్రాండ్‌ అంతర్జాతీయ విస్తరణకు ఇంతకంటే మంచి భాగస్వామి లభించదు’ అని ఈ సందర్భంగా మనీశ్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని