యాంఫీ ఛైర్మన్‌గా బాలసుబ్రమణియన్‌
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాంఫీ ఛైర్మన్‌గా బాలసుబ్రమణియన్‌

వైస్‌ ఛైర్‌పర్సన్‌గా రాధికా గుప్తా

దిల్లీ: ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎ.బాలసుబ్రమణియన్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సమాఖ్య యాంఫీ కొత్త ఛైర్మన్‌గా నియమించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎడెల్‌వైజ్‌ ఏఎంసీ ఎండీ, సీఈఓ రాధికా గుప్తాను వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన యాంఫీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు యాంఫీ ఛైర్మన్‌గా కోటక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) ఎండీ నీలేశ్‌ షా ఉన్నారు. ఇన్వెస్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఇండియా) ప్రై.లి. సీఈఓ సౌరభ్‌ నానావతి స్థానంలోకి రాధికా గుప్తా రానున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని