పేటీఎం, వెస్ట్రన్‌ యూనియన్‌లపై ఆర్‌బీఐ జరిమానా
close

Published : 21/10/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేటీఎం, వెస్ట్రన్‌ యూనియన్‌లపై ఆర్‌బీఐ జరిమానా

ముంబయి: కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై రూ.కోటి, వెస్ట్రన్‌ యూనియన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై రూ.27.78 లక్షల జరిమానాను రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) విధించింది. ధ్రువీకరణకు తుది సర్టిఫికేట్‌ (సీఓఏ) జారీ కోసం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన ఆర్‌బీఐ, అందులోని సమాచారం సరిగ్గా లేదని తెలిపింది. 2007 పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 26 (2) కింద నోటీసు జారీ చేసినట్లు వెల్లడించింది. అనంతరం వచ్చిన సమాధానం, ఇతర విచారణ తర్వాత జరిమానా విధించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని