ప్రభుత్వ బ్యాంకులకు త్వరలో మూలధనం!
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ బ్యాంకులకు త్వరలో మూలధనం!

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మూలధనం ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు నియంత్రణ పరమైన నిబంధనలను పాటించేలా చేయడం కోసం 2021-22 బడ్జెట్లో రూ.20,000 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పెరుగుదలను బట్టి మూలధన అవసరాలను నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితిని చూస్తే రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆర్‌బీఐ విధించిన సత్వర దిద్దుబాటు ప్రణాళిక(పీసీఏఎఫ్‌) నుంచి గత నెలలో యూకో బ్యాంకు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు(ఐఓబీ)లు బయటకు రావడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం పీసీఏ నిబంధనల కింద ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే. గత ఆర్థిక సంవత్సరంలో అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ.20,000 కోట్ల నిధులను జొప్పించగా.. అందులో రూ.11,500 కోట్లు పీసీఏ కింద ఉన్న యూకో బ్యాంకు, ఐఓబీ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకే వెళ్లాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని