close

Published : 20/01/2021 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘పల్లెదారి’ పట్టండి..!

 బడ్జెట్లో గ్రామీణ రోడ్లపై దృష్టిపెట్టాలన్న అసోచామ్

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం పల్లెల్లో రోడ్లపై దృష్టిపెడితే  గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ సహజంగానే పెరుగుతుందని అసోచామ్‌ (ది అసోసియేటెడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) పేర్కొంది.  అంతేకాదు జీఎస్టీ రేట్ల సవరణ, విద్య,వైద్యంపై వ్యయాల్ని పెంచడం వంటి పలు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచింది. వచ్చే బడ్జెట్‌లో ద్రవ్యలోటును నిస్పంకోచంగా పక్కనపెట్టి తయారు చేయాలని పేర్కొంది. భారత్‌లో వ్యయాలను పెంచడానికి, ఎగుమతులను పెంచడానికి రవాణ రంగం ప్రధానంగా ఉపయోగపడుతుందని ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, అసోచామ్‌ అధ్యక్షుడు వినీత్‌ అగర్వాల్‌ తెలిపారు. 

‘‘ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన కింద ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు కేటాయింపులు పెంచాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన దారులు, మండీలు, కోల్డ్‌స్టోరేజీల ఏర్పాటకు  కేటాయింపులు పెరగాలి. వ్యవసాయ రంగంలో టెక్నాలజీల ఆవిష్కరణను ప్రోత్సహించేలా నిధులను ఏర్పాటు చేయాలి’’ అని వినీత్‌ అభిప్రాయపడ్డారు. 

‘నేషనల్‌ కంపెనీలు ప్రతి రాష్ట్రంలో రిటర్నులను ఫైల్‌ చేయాలి. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేలా జీఎస్టీలో మార్పులు చేయాలి. అలా చేస్తేనే పరిశ్రమలు ఎక్కువ వ్యయాలు చేస్తాయి. ఇది ప్రస్తుతం డిమాండ్‌ కోల్పోయిన సేవా రంగానికి ఊపిరి పోస్తుంది. ఇక విద్యారంగానికి కేటాయింపులు పెరిగితే భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాల్లో ద్రవ్యలోటును పక్కనబెట్టి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి. ఇవన్నీ భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ వేగంగా  కోలుకోవడానికి పెట్టుబడిగా భావించాలి’’ ఆయన అన్నారు.

ప్రభుత్వ వ్యయాలు కూడా కొవిడ్‌ సమయంలో పెరిగాయని అసోచామ్‌ తెలిపింది. తొలి త్రైమాసికం బలహీనంగా ఉన్నా.. ఆ తర్వాత నిత్యావసర వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. కాకపోతే ఇది ఎక్కువగా ఆన్‌లైన్‌ మార్కెట్‌కు మొగ్గినట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి

వృద్ధులకు పన్నుపోటు తప్పేనా..!

ఈ బడ్జెట్‌ భిన్నం.. ఎందుకంటే..?

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని