7.6లక్షల హోండా కార్ల రీకాల్‌ - honda recalls 761000 vehicles worldwide to replace fuel pumps
close

Updated : 31/03/2021 22:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

7.6లక్షల హోండా కార్ల రీకాల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థ హోండా భారీగా కార్లను రీకాల్‌ చేసింది. ఈ కార్లకు వినియోగించిన ఫ్యూయల్‌ పంప్స్‌లో సమస్యలు తలెత్తడంతో వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 7,61,000 వాహనాలను ఈ రీకాల్‌ పరిధిలోకి వస్తాయి. వీటిల్లో హోండాతోపాటు దాని అనుబంధ సంస్థ అక్యూరా  వాహనాలు కూడా ఉన్నాయి. 2018 నుంచి 2020 మధ్య తయారైన వాహనాలు వీటిలో ఉన్నాయి. ఈ సమస్య కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగలేదని కంపెనీ తెలిపింది. 

అకార్డ్‌,సివిక్‌, సీఆర్‌-వీ, ఫిట్‌,పైలట్‌, రిడ్జ్‌లైన్‌, ఎండీఎక్స్‌, ఆర్డీఎక్స్‌, టీఎల్‌ఎక్స్‌ మోడల్‌ కార్లు వీటిలో ఉన్నాయి. గత డిసెంబర్‌లో కూడ సాఫ్ట్‌వేర్‌ సమస్యలు, డ్రైవ్‌ షిఫ్ట్‌ల్లో సమస్యలతో అమెరికాలో దాదాపు 14లక్షల కార్లను హోండా రీకాల్‌ చేసి సమస్యను పరిష్కరించింది. అప్పట్లో కూడా పలు లగ్జరీ మోడళ్లు వీటిలో ఉన్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని