Paytm: నెలవారీ ఖర్చులకు రూ.1000 రుణం - Loan of Rs.1000 for monthly expenses: Paytm‌
close

Updated : 06/07/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Paytm: నెలవారీ ఖర్చులకు రూ.1000 రుణం

ముంబయి: ఆర్థిక సేవల ప్లాట్‌ఫాం పేటీఎమ్‌ సోమవారం సరికొత్త సేవలను ప్రారంభించింది. తన ‘బై నౌ..పే లేటర్‌’ సేవలకు కొనసాగింపుగా ‘పోస్ట్‌పెయిడ్‌ మినీ’ సేవలను తీసుకొచ్చింది. దీని కింద వినియోగదార్లకు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నెలవారీ చేతి ఖర్చుల కింద చిన్న మొత్తం రుణాలు  ఇవ్వనుంది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ భాగస్వామ్యంతో కలిసి ప్రవేశపెడుతున్న ఈ ఆఫర్‌ కింద రూ.250 నుంచి రూ.1000 వరకు రుణాలను ఇస్తుంది. 30 రోజుల వరకు గడువుతో వడ్డీలేకుండా అందిస్తోంది. పేటీఎమ్‌ పోస్ట్‌పెయిడ్‌ ఇన్‌స్టంట్‌ క్రెడిట్‌ కింద రూ.60,000 వరకు ఇప్పటికే ఇస్తోంది. వినియోగదార్లు మొబైల్‌, డీటీహెచ్‌ రీఛార్జులు, సిలిండర్‌ బుకింగ్‌, విద్యుత్‌ , నీటి బిల్లులతో పాటు పేటీఎమ్‌ మాల్‌లో షాపింగ్‌కు అవసరమయ్యే నెలవారీ వ్యయాలకు ఇవి ఉపయోగపడతాయని భావిస్తోంది. వార్షిక ఫీజులు, యాక్టివేషన్‌ ఛార్జీలేవీ ఉండవని, కేవలం కన్వీనియన్స్‌ ఫీజు మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. పేటీఎమ్‌ పోస్ట్‌పెయిడ్‌ సేవలను భారత్‌లోని 550 నగరాల్లో పైగా లభ్యమవుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని