టాటాసన్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట - supreme court allows tata sons appeal against nclat order to reinstate cyrus mistry as chairman
close

Updated : 26/03/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటాసన్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటాసన్స్‌కు నేడు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో సైరస్‌ మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌  ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. నేడు దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న,జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌ 17న ఈ కేసులో తీర్పును రిజర్వులో ఉంచింది.

2016లో మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగిస్తూ టాటాసన్స్‌ బోర్డు తీసుకొన్న నిర్ణయం చెల్లుబాటు కాదని 2019 డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు వెలువరించింది. మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలని సూచించింది. దీంతో 2020 జనవరి 2వ తేదీన టాటాసన్స్‌ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత రతన్‌ టాటా కూడా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. అదేనెల 10వ తేదీన సుప్రీం కోర్టు ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే విధించింది. సెప్టెంబర్‌ 22న టాటాసన్స్‌లో షేర్లను షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఎక్కడా తాకట్టు పెట్టకుండా న్యాయస్థానం అడ్డుకొంది. గతేడాది డిసెంబర్‌8న తుది వాదనలను విన్నది. అదే నెల 17న తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు టాటాసన్స్‌ వాదనలను బలపరుస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఇవీ చదవండి

ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ అదరహో
క్రిప్టోకరెన్సీలపై ఆందోళనలున్నాయ్‌మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని