పెరిగిన సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌)ల సంఖ్య‌ - systmatic-investment-plans
close

Published : 13/01/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెరిగిన సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌)ల సంఖ్య‌

మ్యూచువ‌ల్ ఫండ్సులో కొత్త సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌)ల రిజిస్ట్రేష‌న్లు 2020 డిసెంబ‌ర్‌లో 14 ల‌క్ష‌ల 20 వేల‌కు పైగా పెరిగాయి.

అయితే సిప్‌ల పెరుగుద‌ల‌లో కొన్ని సాంకేతిక అంశాలు 2020 డిసెంబ‌ర్‌లో మెరుగైన ప‌నితీరుకు దారితీసాయి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో కొత్త సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (పిస్‌)ల పెరుగుద‌ల‌తో పాటు పెట్టుబ‌డులు పెరిగాయి. భార‌త‌దేశ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌లో భారీ ప్ర‌వాహాల‌కు ఈ సిప్‌లు కార‌ణ‌మ‌య్యాయి.

అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా (అమ్ఫీ) నుండి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం  2020 న‌వంబ‌ర్‌లో 10 ల‌క్ష‌ల 6 వేల సిప్‌లు న‌మోద‌యితే, డిసెంబ‌ర్‌లో 14 ల‌క్ష‌ల 20 వేల‌కు పైగా సిప్‌లు న‌మోద‌య్యాయి. ఒక నెల‌లోనే సిప్‌లు 34% పెరిగాయి. అదే స‌మ‌యంలో నిలిపివేయ‌బ‌డిన సిప్‌లు సంఖ్య న‌వంబ‌ర్‌లో 7,24,000 నుండి డిసెంబ‌ర్‌లో 7,76,000కు పెరిగింది.

ఈ సిప్‌లు పెరుగుద‌ల వ‌ల‌న మ్యూచువ‌ల్ ఫండ్సులో ప్ర‌వాహాలు డిసెంబ‌ర్‌లో రూ. 8,418 కోట్ల‌కు, న‌వంబ‌ర్‌లో రూ. 7,302 కోట్లు పెరిగాయి.

ఈక్విటీల మార్కెట్లో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల త‌ర్వాత పెట్టుబ‌డిదారులు లాభాల‌ను బుక్ చేసుకోవ‌డంతో మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ 2020 రెండ‌వ భాగంలో ఈక్విటీ ఫండ్ల నుండి స్థిర‌మైన ప్ర‌వాహాన్ని ఎదుర్కొంది. 2020లో డీమాట్ ఖాతాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కొంతమంది పెట్టుబ‌డిదారులు మ్యూచువ‌ల్ ఫండ్ల నుండి ప్ర‌త్య‌క్ష స్టాక్ మార్కెట్ల‌కు త‌ర‌లి వెళ్లారు. మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి రికార్డు స్థాయిలో రూ. 13,121 కోట్లు అవుట్ ఫ్లో అయింది.

పెట్టుబ‌డిదారులు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను పూర్తిగా నిష్క్ర‌మించ‌డం లేదు, పెట్టుబ‌డి మార్కెట్ విస్త‌రించినందున వారిలో చాలా మంది సిప్‌ల ద్వారా కొత్త‌గా ప్ర‌వేశిస్తున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని