close
జెట్‌కు నిధుల విడుదల ఇంకా తేలలేదు 

నేడు మళ్లీ బోర్డు సమావేశం 
అంతర్జాతీయ సర్వీసులు 18 వరకు రద్దు

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు కొనసాగేందుకు అత్యవసరంగా నిధులు సమకూర్చాలన్న అంశంపై బ్యాంకర్లు ఇంకా స్థిర నిర్ణయానికి రాలేదు. సోమవారం జెట్‌ యాజమాన్యం, బ్యాంకర్ల సమావేశం సుదీర్ఘంగా సాగినా, తుదినిర్ణయానికి రాలేకపోయింది. ఈ నేపథ్యంలో, జెట్‌ బోర్డు నేడు సమావేశమై, భవిష్యత్తుపై చర్చించనుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌ దూబె తెలిపారు. సంస్థను ఎలా నిర్వహించాలనే విషయమై బోర్డు సూచనలను మేనేజ్‌మెంట్‌ కోరుతుందన్నారు. నిధుల లేమి వల్ల అంతర్జాతీయ సర్వీసులను ఈనెల 18వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సంస్థ వద్ద 7 విమానాలు మాత్రమే ఉన్నాయని, వీటిల్లో 6 ప్రాంతీయ సేవలకు వినియోగించే టర్బో ప్రొపెల్లర్‌లని గుర్తు చేశారు.

ఇచ్చింది రూ.300 కోట్లే

జెట్‌ రుణ పునరుద్ధరణ ప్రక్రియ కింద అత్యవసరంగా రూ.1500 కోట్లు అందచేసేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని బ్యాంకర్లు మార్చి 25న అంగీకరించారు. అప్పటికే రూ.8,000 కోట్లకు పైగా రుణాలు బ్యాంకులకు జెట్‌ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంస్థలో మెజారిటీ వాటీ బ్యాంకుల పరం చేసేందుకు అంగీకరించి, ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. ఆయన వాటా 51 శాతం నుంచి 25 శాతానికి పరిమితమైంది. కానీ బ్యాంకులు ఇప్పటివరకు రూ.300 కోట్లు మాత్రమే సమకూర్చారు. దీనివల్ల లీజుదార్లకు నిధులు కూడా చెల్లించలేక, విమానాలు నిలిచిపోతూ వస్తున్నాయి. ఫలితంగా రోజూ వందల సంఖ్యలో సర్వీసులను జెట్‌ రద్దు చేస్తోంది.

సిబ్బందికి నిరాశ

సోమవారం బోర్డు, బ్యాంకర్ల సమావేశంలో నిధుల విషయమై తేలుతుందని, తమకు వేతన బకాయిలు అందుతాయని పైలట్లు, ఇతర సిబ్బంది ఆశించారు. వారందరకీ నిరాశే మిగిలింది. మంగళవారం కూడా నిధులు అందకపోతే, సంస్థ మనుగడే ప్రమాదంలో పడుతుందని పైలట్ల సంఘం పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం వరకే జెట్‌ విమానాలకు ఇంధన (ఏటీఎఫ్‌) సరఫరా అవుతుందని, తదుపరి నిధులందితేనే సరఫరా చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిధులివ్వకపోతే, విమానాలు నిలిచిపోయే అవకాశముంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో పైలట్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది సోమవారం సమావేశమై కార్యాచరణను చర్చించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.