close

అవీ... ఇవీ

ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో ‘బిగ్‌’ సేల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమైంది. మార్చి 19 నుంచి 22 వరకు ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ పేరిట కొత్త సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్‌, స్మార్ట్‌ ఉత్పత్తులపై ఈ ఆఫర్లు అందిచనుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు ఈ సేల్‌లో 10 శాతం అదనపు డిస్కౌంట్‌ లభించనుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన కొన్ని ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

రెడ్‌మీ నోట్‌ 7ప్రో ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.11,999కి విక్రయించనున్నారు. వివో జడ్‌1 ప్రో రూ.11,990, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9 రూ.21,999, శాంసంగ్‌ గెలాక్సీ ఏ50 రూ.12,999, రియల్‌మీ 5 ప్రో రూ.11,999కి విక్రయించనున్నారు. యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ 64జీబీ వేరియంట్‌ రూ.52,999కే లభించనుంది. ఒప్పో రెనో 10ఎక్స్‌ జూమ్‌ రూ.24,990, ఆసుస్‌ 6జడ్‌ రూ.23,999, గూగుల్‌ పిక్సల్‌ 3ఏని రూ.26,999 (4జీబీ/64జీబీ)కి విక్రయించనున్నారు. ఈ ఫోన్లపై ఆఫర్లతో పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. పలు ఫోన్లకు పాత ఫోన్ల ఎక్చ్సేంజీపై అదనపు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. మొబైళ్లతో పాటు స్మార్ట్‌ టీవీలు, స్మార్ట్‌ గృహోపకరణ ఉత్పత్తులపైనా డిస్కౌంట్లు అందిస్తున్నారు.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.