రాష్ట్రాల వద్ద 1.84 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల నిల్వ - 3 lakh more on the way centre
close
Updated : 28/05/2021 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రాల వద్ద 1.84 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల నిల్వ

వెల్లడించిన కేంద్రం

దిల్లీ: రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద మే 28 నాటికి 1.84 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. అలాగే మరో మూడు రోజుల్లో అదనంగా మూడు లక్షలకు పైగా టీకా డోసులను అందజేయనున్నట్లు తెలిపింది. అయితే వాటిని ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో మాత్రం వివరించలేదు. 

‘రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1,84,92,677 కొవిడ్ టీకా డోసులు నిల్వ ఉన్నాయి. మూడు రోజుల్లో అదనంగా 3,20,380కు పైగా డోసులు అందనున్నాయి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఉచితంగా అందినవి, రాష్ట్రాలు నేరుగా సేకరించిన వాటితో కలిపి మొత్తం టీకా డోసుల సంఖ్య 22.46 కోట్లకుపైనే అని పేర్కొంది. అలాగే వినియోగించినవి, వృథా అయినవి కలిపి 20,48,04,853 డోసులని తెలిపింది. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా టీకాలు సరఫరా చేస్తూ సహకరిస్తోందని తెలిపింది. అలాగే నేరుగా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించిందని కూడా వ్యాఖ్యానించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని