బన్నీ 21వ చిత్రం.. ఆ కలయికలోనేనా? - A R Murugadoss to direct Allu Arjun
close
Published : 03/05/2021 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ 21వ చిత్రం.. ఆ కలయికలోనేనా?

ల్లు అర్జున్‌ - మురుగదాస్‌ - ఈ కలయికలో సినిమా ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ‘మేం కలిసి సినిమా చేస్తాం’ అని ఇద్దరూ ఇదివరకే ప్రకటించారు. తాజాగా మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చ మొదలైంది. అల్లు అర్జున్‌ 21వ చిత్రం ఈ కలయికలోనే పట్టాలెక్కనుందనేది దాని సారాంశం. అల్లు అర్జున్‌ 20వ చిత్రంగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ రూపొందుతున్న విషయం తెలిసిందే. అది పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఇటీవల ఆ ప్రాజెక్టు విషయంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ‘ఆచార్య’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు కొరటాల. దాంతో ఇప్పుడు బన్నీ 21వ సినిమా ఎవరితో చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. బన్నీ కోసం శ్రీరామ్‌ వేణు మొదలుకొని ప్రశాంత్‌ నీల్‌ వరకు పలువురు దర్శకులు కథలు సిద్ధం చేశారు. అందులో మురుగదాస్‌ కూడా ఉన్నారు. ఆ సినిమాకి ఇప్పుడు సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. గీతాఆర్ట్స్‌ సంస్థ బన్నీ 21వ చిత్రాన్ని మురుగదాస్‌ దర్శకత్వంలోనే రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్క్రిప్ట్‌కి సంబంధించిన పనులు ఊపందుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన   వెలువడొచ్చని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని