చాలామంది ఆత్మహత్యలకు కారణం ఇదే! - ANXIETY Puri Musings by Puri Jagannadh
close
Updated : 08/12/2020 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాలామంది ఆత్మహత్యలకు కారణం ఇదే!

హైదరాబాద్‌: ప్రస్తుతం చాలా మంది యాంగ్జైటీతో బాధపడుతున్నారని, దాన్ని తగ్గించుకునేందుకు మంచి ఆహారం, వ్యాయామం చేయాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌ సూచించారు. పూరి మ్యూజింగ్స్‌ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా యాంగ్జైటీ అనే అంశంపై ఆయన మాట్లాడారు.

‘‘ఈ రోజుల్లో యాంగ్జైటీ అనేది సహజమైపోయింది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. బాగా కావాల్సిన వాళ్లు చనిపోయినప్పుడు, పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఇలా ఏదో ఒకదాని వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది తీవ్రమైన నొప్పితో కూడా బాధపడుతుంటారు. యాంగ్జైటీని వర్ణించలేం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఏదో తెలియని భయం. గుండె దడదడలాడుతుంది. ఏమీ చేయలేని పరిస్థితి. చాలా మంది ఆత్మహత్య  చేసుకోవడానికి కూడా కారణం ఇదే. యాంగ్జైటీలో ఏం చేస్తామో తెలియదు. దీని నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మద్యం, కాఫీ బాగా తగ్గించాలి. ఎక్కువసేపు నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే అప్పుడప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ ఉండాలి’’

‘‘మీ ఇంట్లో పెంపుడు జంతువులతో ఆడుకుంటుంటే దీని నుంచి త్వరగా బయటపడొచ్చు. ఇక టోనికార్డ్‌ (tonicard gold drops)అనే హోమియో ఔషధాన్ని తీసుకోండి. కొంతమందికి రాత్రి వేళ నిద్ర పట్టదు. ఈ చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అలాంటి వాళ్లు కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. నాకు తెలిసిన చాలా మంది వాడుతున్నారు. మీరు హోమియోపతి నమ్మితే దీన్ని వాడి చూడండి. ఈ ఔషధం చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇవీ చదవండి

వీటి వల్లే వ్యాధులు పెరిగిపోతున్నాయ్‌: పూరి

ప్రకృతిలో మనం ‘అద్దెదారులం’ : పూరి జగన్నాథ్
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని