సుశాంత్‌ మృతి కేసు.. సీబీఐ ప్రకటన - CBI issues official statement on Sushant Singh Rajput case
close
Published : 28/09/2020 23:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ మృతి కేసు.. సీబీఐ ప్రకటన

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కొనసాగుతోందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ప్రకటించింది. సీబీఐ కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. కేసును తప్పుదోవపట్టించేందుకు కావాలనే ఇలా చేస్తున్నారని సుశాంత్‌ కుటుంబ సభ్యులు, వారి తరఫు న్యాయవాది వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ సోమవారం స్పందించింది. ‘సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణానికి సంబంధించి కేసును దర్యాప్తు చేస్తున్నాం. అన్ని అంశాలను వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నాం. ఇప్పటి వరకు ఏ అంశాన్ని, ఆరోపణని మేం తోసిపుచ్చలేదు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని ప్రకటన విడుదల చేసింది.

జూన్‌ 14న సుశాంత్‌ తన ఇంట్లోని గదిలో ఉరివేసుకుని కనిపించారు. ఆయన మరణం కుటుంబ సభ్యులతోపాటు అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. సుశాంత్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ క్రమంలో కేసు అనేక మలుపులు తిరిగింది. ఈడీ, సీబీఐ, ఎన్సీబీ దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్‌ కోణం వెలుగులోకి రావడంతో ఇప్పటికే అనేక మందిని విచారించి, సుశాంత్‌ ప్రియురాలితో పాటు పలువుర్ని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీబీ కేసును ముందుకు తీసుకెళ్తున్నా.. సీబీఐ అప్‌డేట్‌ ఇవ్వలేదని సుశాంత్‌ శ్రేయోభిలాషులు ఆరోపణలు చేశారు. 

మరోవైపు సుశాంత్‌ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎయిమ్స్‌ ఇంకా సీబీఐకి నివేదిక సమర్పించలేదు. దీంతో #AIIMSBeFairWithSSRReport అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. గత వారం సుశాంత్‌ కుటుంబం తరఫు న్యాయవాది ట్వీట్‌ చేస్తూ ‘సుశాంత్‌ హత్యను సీబీఐ ఆత్మహత్యగా మార్చాలి అనుకుంటోంది. నేను పంపిన ఫొటోలు చూసిన ఎయిమ్స్‌ బృందంలోని నా స్నేహితుడు సుశాంత్‌ది 200 శాతం హత్యని, ఆత్మహత్య కాదని నాకు చెప్పారు’ అని పేర్కొన్నారు. దీనిపై ఎయిమ్స్‌ స్పందిస్తూ.. ఇంకా సీబీఐకి నివేదిక ఇవ్వలేదని, కేవలం ఫొటోలు చూసి ఇలాంటి విషయాల్లో తుది నిర్ణయానికి రాలేమని పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని