సోనూ.. నీ మనసు బంగారం: చిరు - Chiranjeevi Appreciates Sonu Sood
close
Updated : 21/12/2020 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూ.. నీ మనసు బంగారం: చిరు

రియల్‌ హీరోను ప్రశంసించిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: నటుడు సోనూసూద్‌ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఆచార్య’ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యింది. తాజా షెడ్యూల్‌లో భాగంగా చిరు-సోనూలపై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. తాను చేస్తున్న సేవల పట్ల చిరు సంతోషం వ్యక్తం చేశారని.. షూటింగ్‌లో తనని కొట్టడానికి కూడా ఆయన ఎంతో ఇబ్బందిపడ్డారని ఇటీవల సోనూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు ఎంతో గొప్పవారని పేర్కొంటూ తాజాగా సోనూసూద్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘నేను కలిసి పనిచేసిన ఎంతోమంది గొప్ప వ్యక్తుల్లో, మర్యాదపూర్వకమైన వారిలో ఒకరైన చిరంజీవి సర్‌ ఎంతో మంచి వ్యక్తి. లవ్‌ యూ.‌’ అని పేర్కొన్నారు.

కాగా, సోనూసూద్‌ పెట్టిన ట్వీట్‌పై చిరు స్పందించారు. సోనూని ప్రశంసించారు. ‘ధన్యవాదాలు సోనూసూద్‌. నువ్వు మంచివాడివి. నువ్వు ఇలాగే ఎంతోమంది నిస్సహాయులకు సాయం చేయాలని, ఎన్నో లక్షల మందిలో ప్రేరణ నింపాలని ఆశిస్తున్నా. నీ శక్తి సామర్థ్యాలు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నా. నీ బంగారంలాంటి మనసుతో మరింత గుర్తింపు పొందుతావు’’ అని చిరు అన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో వలసకూలీల కోసం సోనూసూద్‌ చేసిన సాయం పట్ల ప్రతిఒక్కరూ హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరి కోసం ఆయన ప్రత్యేకంగా రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశారు. చివరి శ్వాస వరకూ తాను సేవలు చేస్తూనే ఉంటానని సోనూ పలు సందర్భాల్లో తెలిపారు.

ఇవీ చదవండి..

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని