‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది - Chiru 152 First look released
close
Published : 23/08/2020 02:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. శనివారం చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

ధర్మస్థలిలో సాధువులు, గ్రామ ప్రజలు నిలబడి ఉండగా, ఎర్ర కండువా ధరించి కత్తితో శత్రువులపై పోరాడుతున్న చిరంజీవిని మోషన్‌ పోస్టర్‌లో చూపించారు. ‘ధర్మం కోసం ఒక కామ్రేడ్‌ చేసిన అన్వేషణ’ అంటూ కొరటాల శివ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘ఆచార్య’ షూటింగ్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే చిరు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌. తాజా మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే కథ అదేనని అర్థమవుతోంది. అయితే, కొరటాల శివ టేకింగ్‌, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు కొరటాల, ఇటు చిరు పలు సందర్భాల్లో చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని