రూ.66లక్షల కోట్ల ఉద్దీపనకు అమెరికా ఆమోదం! - Congress approves USD 900B COVID relief bill
close
Published : 22/12/2020 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.66లక్షల కోట్ల ఉద్దీపనకు అమెరికా ఆమోదం!

వాషింగ్టన్‌: కరోనా ధాటికి వణికిపోతోన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం దాదాపు రూ.66లక్షల కోట్ల (900బిలియన్‌ డాలర్ల) ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేసింది. కొవిడ్‌ విజృంభణతో అతలాకుతలమవుతోన్న అమెరికా సంస్థలు, పౌరులకు వివిధ రూపాల్లో ఈ ప్యాకేజీ కింద ఆర్థిక భరోసాను కలిగించనున్నట్లు అమెరికా ఉభయసభలు వెల్లడించాయి. వీటితో పాటు కరోనా వ్యాక్సిన్‌కు కావాల్సిన నిధులను కూడా ఇందులో నుంచే ఖర్చుచేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈ బిల్లును ఆమోదించిన ఉభయసభలు, అధ్యక్షుడి సంతకం కోసం పంపించాయి. ఈ బిల్లుకు ఉభయసభల్లో మెజారిటీ సంఖ్యలో రిపబ్లికన్లతో పాటు డెమొక్రాట్‌ల మద్దతు లభించింది.

కరోనా వైరస్‌ కారణంగా కుదేలైన అమెరికా వ్యాపార సంస్థలతో పాటు పౌరులకు వ్యక్తిగతంగానూ ఈ ఉద్దీపన ప్రయోజనాలు అందనున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి వారానికి దాదాపు రూ.22వేల(300డాలర్లు)ను అందించనున్నారు. ఇక చాలా మంది అమెరికా పౌరులకు 600డాలర్లు ఆర్థిక ప్రయోజనం అందనున్నట్లు సమాచారం. వీరికి తోడు కరోనా వల్ల నష్టాన్ని చవిచూస్తోన్న ఆరోగ్య సంరక్షణ సంస్థలు, వ్యాపారులు, పాఠశాలలు, రెస్టారంట్లు, థియేటర్లకు ఈ ఉద్దీపన ద్వారా ప్రత్యక్ష చెల్లింపులు చేసే అవకాశం ఉంది. వచ్చే వారంలోనే ఈ ఉద్దీపన ప్రయోజనాలను బ్యాంకు అకౌంట్ల ద్వారా ప్రజలకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌ అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉద్దీపన ప్యాకేజీని మరింత పెంచే యోచనలో ఉన్నట్లు డెమొక్రాట్లు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి..

మోదీకి అమెరికా ప్రసిద్ధ పురస్కారం అగ్రరాజ్యానికి పెను ముప్పే..!


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని