దిల్లీ భాజపా అధ్యక్షుడికి కరోనా - Delhi BJP chief Adesh Gupta tests positive for coronavirus
close
Published : 16/09/2020 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ భాజపా అధ్యక్షుడికి కరోనా

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా కొవిడ్‌ బారిన పడ్డారు. తన నివేదికలో పాజిటివ్‌గా తేలినట్లు బుధవారం ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. పలు లక్షణాలు కనిపించడంతో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడంతో వ్యాధి నిర్ధరణ అయినట్లు స్పష్టం చేశారు. కాగా ఈ మధ్యకాలంలో తనతో కాంటాక్ట్‌ అయిన వారందరు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ‘గతవారం కొద్దిపాటి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాను. అప్పుడు నెగెటివ్‌గా వచ్చింది. అయితే ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బుధవారం మళ్లీ పరీక్షలు చేయించుకోగా ఈసారి పాజిటివ్‌గా తేలింది. గత వారం నుంచి క్వారంటైన్‌లోనే ఉన్నాను. నాతో కాంటాక్ట్‌ అయినవారు పరీక్షలు చేయించుకోండి’ అంటూ ట్వీట్‌ చేశారు. దిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సైతం సోమవారం వైరస్‌ బారినపడ్డారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని