పవన్‌ చిత్రం కోసం హాలీవుడ్‌ నిపుణులు - Hollywood VFX supervisor working for Pawan Kalyan next flim
close
Published : 12/09/2020 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ చిత్రం కోసం హాలీవుడ్‌ నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రీలుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కేవలం 15రోజుల షూటింగ్‌ను మాత్రమే జరుపుకొంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిపోయింది.

తాజాగా సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మళ్లీ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో హాలీవుడ్‌ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘ఆక్వామెన్‌’, ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘వార్‌క్రాఫ్ట్‌’ వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇటీవల పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా బెన్‌లాక్‌ కూడా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

ఇక ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. దీన్ని పాన్‌ ఇండియా సినిమాగా మలచాలని నిర్మాతలు భావిస్తున్నారట. క్రిష్‌కు బాలీవుడ్‌లోనూ పనిచేసిన అనుభవం ఉండటంతో అటు పవన్‌నూ, ఇటు చిత్ర నిర్మాతలనూ ఒప్పించారట. ఇందులో భాగంగానే బాలీవుడ్‌ నటుడిని ప్రతినాయకుడిగా తీసుకోవాలని అనుకుంటున్నారు. అదే సమయంలో ఇద్దరు కథానాయికలకు ఈ సినిమాలో చోటు ఉన్నట్లు సమాచారం. 

మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందించనుండగా, రామ్‌-లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దనున్నారు. ఇక మరోవైపు పవన్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసిన థియేటర్‌లలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని