
తాజా వార్తలు
ఎంతోమంది తిరస్కరించారు..: స్టార్ సింగర్
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..!
ముంబయి: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కైలాశ్ ఖేర్. సంగీతం పట్ల ఆయన చూపిస్తున్న చొరవకు 2017లో పద్మశ్రీ పురస్కరాన్ని అందించి కేంద్రప్రభుత్వం సత్కరించింది. గాయకుడిగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఆయన తాజాగా తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయికు వచ్చిన కొత్తలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. కొంతమంది తనను తిరస్కరించారని చెప్పారు.
‘‘జీవితంలో నాకు స్ఫూర్తి ఎవరూ లేరు. ముంబయి వచ్చిన కొత్తలో వృత్తిపరంగా నన్ను ఎంతోమంది రిజెక్ట్ చేశారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. మరెన్నో కోల్పొయాను. ఒకానొక సమయంలో కోల్పొవడానికి నా దగ్గర ఏమీ లేదు. చనిపోవాలనుకున్నా. ఆ క్షణమే నాకు స్ఫూర్తిగా మారింది. అప్పుడే నిర్ణయించుకున్నా కచ్చితంగా ఏదైనా సాధించాలని. వృత్తిపరంగా నీకెంత అనుభవం ఉన్నా.. నువ్వు ఎంత నేర్చుకున్నా.. ఇండస్ట్రీలో నిన్ను ఎవరూ గైడ్ చేయరు. కృతజ్ఞతలేని వాళ్లు, క్రూరమైన వాళ్లు ఇక్కడ ఉంటారని తెలిసింది. వాళ్లలా నేను ఉండకూడదని నిర్ణయించుకున్నా. టాలెంట్ ఉన్న నూతన గాయనీ గాయకులకు సాయం చేయాలనుకున్నా. అలా ప్రతి ఏటా కొంతమందిని ఎంపిక చేసి వాళ్లకి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తున్నా’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైలాష్ ఖేర్ తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
