మహిళల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల - ICC released 2022 Womens T20 World Cup schedule
close
Published : 15/12/2020 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ 2022 మహిళల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ స్వయంగా ట్విటర్‌లో ఆ సమాచారం పంచుకుంది. మొత్తం 8 జట్లు 31 రోజులు, 31 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపింది. న్యూజిలాండ్‌ వేదికగా 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఆరు మైదానాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు చెప్పింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలి క్వాలిఫయర్‌ జట్టుతో తలపడనుందని స్పష్టం చేసింది. ఆక్లాండ్‌, తారంగా, హామిల్టన్‌, వెల్లింగ్టన్‌, క్రైస్ట్‌చర్చ్‌, డునెదిన్‌ వేదికల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించింది. 

మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి విశేషమైన ఆదరణ లభించింది. ఈ టోర్నీలో భారత్‌ టాప్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగగా ఫైనల్లో ఆతిథ్య జట్టు చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో దూసుకెళ్లిన హర్మన్‌ప్రీత్‌ సేన తుదిపోరులో చేతులెత్తేసింది. దీంతో తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ సాధించాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. మార్చి 8న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సుమారు 86 వేల మంది హాజరయ్యారు. అలాగే డిజిటల్‌ మాధ్యమాల్లోనూ రికార్డు స్థాయిలో వీక్షించారు. దీంతో మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దొరికింది. ఇక 2022లో వీక్షకుల సంఖ్య ఏమేరకు చేరుతుందో చూడాలి.

ఇవీ చదవండి..

86 జట్లు.. 225 మ్యాచ్‌లు..

షమి, బుమ్రా: 20 కంగారూల వేట!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని