పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. - Kangana Ranaut will Return Padma Shri if She Cant Prove Her Claims About Sushant Singh Rajputs Death
close
Published : 18/07/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా..

నెపోటిజంపై వాదనలకు కట్టుబడి ఉన్నానన్న కంగనా రనౌత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, వెనకడుగు వేస్తే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి నెపోటిజమే (బంధుప్రీతి) కారణమంటూ గతంలో పలువురిని ప్రత్యక్షంగానే విమర్శించారు. జూన్‌ 14న సుశాంత్‌ మృతి అనంతరం కంగనా సోషల్‌ మీడియాలో పలు వీడియోలు విడుదల చేశారు. అందులో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాతలు, నటీనటులను విమర్శించారు. బాలీవుడ్‌తోపాటు మీడియా నుంచి సుశాంత్‌ ఎదుర్కొన్న ఒత్తిడి, తిరస్కరణపై కంగన మాట్లాడారు. నటుల పేర్లు ప్రస్తావించకుండా ఇష్టారీతిలో కథనాలు రాసే జర్నలిస్టులపై మండిపడ్డారు. ‘యువ నటుడిది ఆత్మహత్యా? లేక హత్యా?’ అని వీడియోలో ప్రశ్నించారు.  

గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా మళ్లీ మాట్లాడుతూ తాను చేసిన వాదనలను నిరూపించలేకపోతే భారత ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ‘మనాలిలో ఉన్న నన్ను ముంబయి పోలీసులు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని అడిగారు. నేను అందుకు సిద్ధంగా ఉన్నానని వారితో అన్నాను. కానీ పోలీసులు మళ్లీ సంప్రదించలేదు. నా వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను. వాటిని నేను నిరూపించలేకపోతే పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాప్సీ, స్వర భాస్కర్‌ లాంటి నటీమణులు ఇండస్ట్రీని ప్రేమిస్తున్నాం అని ప్రకటించవచ్చు. మరి అలాంటి వాళ్లకు కరణ్‌ జోహార్‌ లాంటి నిర్మాతలు ఎందుకు అవకాశాలు ఇవ్వడంలేదు. ఆలియా భట్‌, అనన్య పాండే లాంటివారికి మాత్రమే ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు. బాలీవుడ్‌లో వారి ఉనికే నెపోటిజానికి నిదర్శనం. నాకు తెలుసు.. ఈ వ్యాఖ్యల అనంతరం నన్నో పిచ్చిదాన్ని చేస్తూ కథనాలు కూడా రావొచ్చు’ అని విమర్శించారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని