చైనాలోనూ 7కోట్ల ఉద్యోగాలు మాయం! - Mass unemployment in China
close
Published : 03/08/2020 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాలోనూ 7కోట్ల ఉద్యోగాలు మాయం!

బీజింగ్‌: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో మాత్రం పరిస్థితులపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. అయితే  చైనా కూడా కరోనా ఆర్థికంగా కుంగిపోయినట్లు అక్కడి ఆర్థికరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా చైనీయులు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

మార్చి నెలలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో చైనాలో చాలాచోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగాయి. ఈ సమయంలో దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అధికారిక లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు దాదాపు 6శాతంగా నమోదైనట్లు గణాంకాలు పేర్కొన్నాయి. దీనిపై అక్కడి ఆర్థికరంగ నిపుణులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. వలస కార్మికులు, చిన్న, మధ్య తరహా సంస్థల్లో పనిచేసే కార్మికులను అధికారిక సర్వేలో పరిగణలోకి తీసుకోలేదని బీజింగ్‌కు చెందిన ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు హూ షింగ్‌డౌ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాతోపాటు పలుదేశాలతో అనుసరిస్తున్న వైఖరి కారణంగా రాబోయే కొన్నిరోజుల్లో మరో కోటి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చైనా ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో చైనా ఎగుమతులపైనా ఈ ప్రభావం పడింది. ఈమధ్యే డిగ్రీ పూర్తిచేసుకున్న వారిలో దాదాపు 19.3శాతం నిరుద్యోగులుగానే మిగిలిపోయే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీరితోపాటు భారీ సంఖ్యలో పట్టణాలకు చేరుకుంటున్న వలస కార్మికులకు కూడా ఉపాధి దొరకని ప్రమాదం ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. కరోనా ప్రభావంతో దుకాణాలు, మార్కెట్లు, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికుల ఉద్యోగాలకు కూడా ఎసరు పడింది. దీంతో ఏప్రిల్‌ నెలలో నిరుద్యోగిత రేటు దాదాపు 20.5శాతంగా ఉండనున్నట్లు జోంగ్‌టై సెక్యూరిటీస్‌ అనే బ్రోకేజి సంస్థ అంచనా వేసింది. అప్పటికే దాదాపు 7కోట్ల ఉద్యోగాలు మాయం అయినట్లు తన నివేదికలో పేర్కొంది.

జీడీపీ వృద్ధి రేటునూ ప్రకటించని చైనా..

దేశవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటకీ బయటకు మాత్రం దేశ ఆర్థికస్థితిపై ఎలాంటి సమాచారాన్ని చైనా విడుదల చేయలేదు. అంతేకాదు వార్షిక సమావేశాల్లో తన జీడీపీని కూడా ప్రకటించలేదు. అయితే, భారీస్థాయిలో ఆర్థికవ్యవస్థ క్షీణించిందని మాత్రం చైనా జాతీయ గణాంకాల కార్యాలయం ఏప్రిల్‌ చివరలో ప్రకటించింది. 1976 తరువాత ఆర్థిక వ్యవస్థ 7శాతం పడిపోవడం ఇదే తొలిసారని స్పష్టం చేసింది. నివేదిక బయటకు రావడంతో మూడు దశాబ్దాల్లో అధికంగా దేశ ఆర్థికవ్యవస్థ క్షీణించిన విషయాన్ని చివరకు చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ధృవీకరించింది. అయితే ఈ నివేదికను వెంటనే ఇంటర్నెట్‌ నుంచి తొలగించిన చైనా ప్రభుత్వం, దీన్ని రూపొందించిన అధికారులపై చర్యలు తీసుకోవడం గమనార్హం. కరోనా విజృంభణకు ముందు కూడా చైనా ఆర్థికస్థితి మెరుగైన స్థితిలో లేదని పలు నివేదికలు స్పష్టం చేశాయి. తాజాగా ఆ పరిస్థితులు మరింత దిగజారినట్లు స్పష్టం అవుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని