సమర్థవంతంగా మోడెర్నా వ్యాక్సిన్‌! - Moderna covid 19 vaccine found 94 percent effective
close
Published : 16/11/2020 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమర్థవంతంగా మోడెర్నా వ్యాక్సిన్‌!

94.5శాతం సమర్థత కలిగి ఉన్నట్లు విశ్లేషణలో వెల్లడి

వాషింగ్టన్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న మోడెర్నా రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు సమాచార విశ్లేషణలో వెల్లడైంది. ముందస్తుగా నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణమైన సమర్థతను తమ వ్యాక్సిన్‌ చేరుకుందని మోడెర్నా తాజాగా ప్రకటించింది. మొదటి మధ్యంతర విశ్లేషణలో భాగంగా 94.5శాతం సమర్థతతో వ్యాక్సిన్‌ పనితీరు కనబరిచినట్లు మోడెర్నా వెల్లడించింది. వ్యాక్సిన్‌ ప్రయోగాలపై ఏర్పాటుచేసిన డేటా సేఫ్టీ మానీటరింగ్‌ బోర్డ్‌(డీఎస్‌ఎంబీ) ఈ విషయాన్ని తెలిపినట్లు మోడెర్నా ప్రకటించింది.

అమెరికా వైద్యశాఖలోని జాతీయ ఆరోగ్య కేంద్రం, బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కలిసి మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాలను ‘COVE’ పేరుతో చేపట్టాయి. ఇందుకోసం అమెరికాలో దాదాపు 30వేల మంది వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాయి. రెండో డోసు ఇచ్చిన అనంతరం రెండు వారాల సమాచారాన్ని విశ్లేషించాయి. మొత్తం 95 కేసుల సమాచారాన్ని విశ్లేషించగా వీటిలో 90 కేసులు ప్లెసిబో గ్రూపునకు చెందగా, మరో ఐదు కేసులు mRNA-1273 గ్రూపునకు చెందినవి ఉన్నాయి. వీటి మధ్యంతర విశ్లేషణలో భాగంగా, 94.5శాతం సమర్థతతో వ్యాక్సిన్‌ పనిచేస్తున్నట్లు మోడెర్నా వెల్లడించింది.

వ్యాక్సిన్ పరిశోధనాభివృద్ధికోసం మోడెర్నాకు దాదాపు రూ.7వేల కోట్ల (1 బిలియన్‌ డాలర్లు) ఆర్థిక సహాయాన్ని అమెరికా ప్రభుత్వం అందించింది. ఇందులో భాగంగా 10కోట్ల డోసులను అమెరికాకు అందిచాల్సి ఉంటుంది. ఇక, ఫైజర్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ కూడా 90శాతం సమర్థతతో పనిచేస్తుందని ప్రకటించిన వారం తర్వాత మోడెర్నా ఈ ప్రకటన చేయడం విశేషం.

ఇదిలాఉంటే, మధ్యంతర విశ్లేషణలో ఫైజర్‌, మోడెర్నా సంస్థల వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో త్వరలోని ఈ నివేదికలను అక్కడి నియంత్రణ సంస్థలకు అందించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ వేగంగా పూర్తైతే మాత్రం వచ్చే నెలలోనే అమెరికాలో అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి.. 
ఫైజర్‌: 90శాతం సమర్థతతో వ్యాక్సిన్‌
మోడెర్నా టీకా: వృద్ధుల్లోనూ మెరుగైన ఫలితాలు!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని