‘అ ఆ’లో ఆ నాలుగు సన్నివేశాలు లేవట! - Paruchuri Gopala Krishna Talks About Trivikram Srinivas AA
close
Published : 04/09/2020 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అ ఆ’లో ఆ నాలుగు సన్నివేశాలు లేవట!

ఇంటర్నెట్‌డెస్క్‌: నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అ ఆ’.  2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. నితిన్‌, సమంతల నటన, త్రివిక్రమ్‌ దర్శకత్వం శైలి, మిక్కీ జే మేయర్‌ పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే, తొలుత త్రివిక్రమ్‌ ఈ సినిమా క్లైమాక్స్‌ను మరోలా అనుకున్నారట. అనసూయ(సమంత)ను తీసుకుని ఆనంద్‌ విహారి(నితిన్‌) తన ఊరు వెళ్లడం, అప్పటికే అక్కడకు చేరుకున్న అనూసూయ తల్లి మహాలక్ష్మి(నదియా) హారతి పట్టి ఇంటి లోపలికి పిలవడంతో సినిమాకు శుభం కార్డు వేయాలని అనుకున్నారు.

అయితే, రషెస్‌ చూసిన తర్వాత క్లైమాక్స్‌లో మరికొన్ని సన్నివేశాలు జత చేస్తే బాగుంటుందని భావించారు. అప్పుడే మహాలక్ష్మికి రామలింగం(నరేష్‌) నచ్చజెప్పే సన్నివేశం, ఆ తర్వాత ఊరికి వెళ్లిన తల్లీకూతుళ్లు గదిలో మాట్లాడుకోవడం, పల్లం వెంకన్న(రావు రమేశ్‌), ఆమె కూతురు నాగవల్లి(అనుపమ పరమేశ్వరన్‌)ల మధ్య సన్నివేశంతో పాటు, చివరిలో పొలం వద్ద పల్లం వెంకన్న, అతని కొడుకు, ఇంట్లో పనివాడి మధ్య వచ్చే సన్నివేశాలను జత చేశారు. అలా క్లైమాక్స్‌ మరో 10 నిమిషాలు పెరగడమే కాకుండా, సినిమాను చూసిన ప్రేక్షకుడికి ఒక ఫుల్‌ మీల్‌ తిన్న సంతోషం కలుగుతుంది. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్‌ స్వయంగా తనతో పంచుకున్నారని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని