సినిమాని తలపిస్తున్న పిల్లల ఫైట్‌..! - Prashanth Neel Appreciate the kids Talent
close
Updated : 19/09/2020 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమాని తలపిస్తున్న పిల్లల ఫైట్‌..!

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియోలు

హైదరాబాద్‌: సమాజంపై సినిమాల ప్రభావం అధికంగా ఉంటుంది. పిల్లలపై ఇంకాస్తా ఎక్కువే. సోషల్‌మీడియా పుణ్యమా అని చాలామంది చిన్నారులు తమలోని యాక్టింగ్‌ టాలెంట్‌ను బయటపెట్టి వెలుగులోకి వస్తున్నారు. ఇదే మాదిరిగా కొంతమంది చిన్నారులు రూపొందించిన వీడియోలు తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా సదరు చిన్నారుల టాలెంట్‌ చూసి సినీ ప్రముఖులు సైతం ప్రశంసించారు.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని ఫస్ట్‌ ఫైట్‌ను‌(చున్నీ కోసం నవదీప్‌ అండ్‌ గ్యాంగ్‌తో చేసే ఫైట్‌) బన్నీపై చాలా స్టైలిష్‌గా చిత్రీకరించారు. తాజాగా, అదే సన్నివేశానికి కొంతమంది చిన్నారులు ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు. సినిమాలో బన్నీ ఏవిధంగా అయితే ఫైట్‌ చేశాడో.. అచ్చంగా అలాగే చిన్నారులు కూడా నటించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌.. ‘అల.. వైకుంఠపురములో..’ టీమ్‌ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో షేర్‌ చేసింది. సదరు వీడియో చూసిన సంగీత దర్శకుడు తమన్‌.. ‘కుమ్మేశారు.. ఈ మొత్తం వీడియోని ఇప్పుడే మా టీంకి పంపుతాను’ అంటూ రిప్లై ఇచ్చారు.

మరోవైపు, యశ్‌ కథానాయకుడిగా, ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ సినిమాకి ఎంతోమంది అభిమానులున్న విషయం తెలిసిందే. అందులోని పోరాట సన్నివేశాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ సినిమా నుంచి హీరో చిన్నప్పుడు జరిగిన ఫైట్‌ సన్నివేశాన్ని కొంతమంది చిన్నారులు రీక్రియేట్‌ చేశారు. సినిమాలో చూపించిన మాదిరిగానే ఫైట్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించి ట్విటర్‌ వేదికగా ప్రశాంత్‌నీల్‌, యశ్‌ను ట్యాగ్‌ చేస్తూ వీడియో పోస్ట్‌ చేశారు. అయితే ఆ వీడియో చూసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. చిన్నారుల టాలెంట్‌ చూసి మురిసిపోయారు. అలాగే చిన్నారులను అభినందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని