రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చెర్రీ..! - Ram Charan in Raghavendra Rao Direction Social Media Viral Content
close
Published : 10/10/2020 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చెర్రీ..!

నెటిజన్లు ఏమనుకుంటున్నారంటే..

హైదరాబాద్‌: కుటుంబ కథా చిత్రమైనా.. భక్తిరస ప్రధాన చిత్రమైనా.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలు తెరకెక్కిస్తుంటారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఘరానా మొగుడు’ చిత్రాలతో చిరుకి మంచి విజయాలను అందించిన రాఘవేంద్రరావు త్వరలో చిరు తనయుడు రామ్‌ చరణ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. చెర్రీ 14వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా పాన్‌ ఇండియన్‌ స్థాయి మూవీగా ఈ సినిమా ఉండనుందంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో రాఘవేంద్రరావు - చరణ్‌ కాంబినేషన్‌ గురించి ప్రస్తుతం నెట్టింట్లో అందరూ చర్చించుకుంటున్నారు.

‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘పెళ్లి సందడి’. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘పెళ్లి సందడి మళ్లీ మొదలుకాబోతోంది.’ అని తాజాగా ఆయన పోస్ట్‌ పెట్టారు. అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటించనున్నారనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. కాగా, రాఘవేంద్రరావు-చరణ్‌ కాంబినేషన్‌లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌ ఉండొచ్చని గతంలో విపరీతంగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని