‘రివర్స్‌’ పాలనతో వచ్చిన తిరకాసు!

ప్రతి మెడికల్‌ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్‌ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్‌ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు.

Updated : 05 May 2024 08:51 IST

ప్రతి మెడికల్‌ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్‌ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్‌ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. మచిలీపట్నం మెడికల్‌ కళాశాలను కట్టేశామని ప్రచారం చేసుకుంటున్న నాయకులు మిగిలిన నిర్మాణాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళాశాల ఆసుపత్రిలోని 5 బ్లాకుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఎవరైనా పనులన్నీ పూర్తయ్యాక ప్రారంభోత్సవాలు చేస్తారు. వైకాపా నాయకులు మాత్రం మొదట ప్రారంభించి పనులు నిదానంగా చేస్తున్నారు. ఇదంతా ‘రివర్స్‌’ పాలన మహిమంటూ పలువురు విమర్శిస్తున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని