Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 May 2024 09:14 IST

1. ఆకేపాటి ఓ కబ్జాకోరు!

‘అరాచక వైకాపా ప్రభుత్వం పోవాలంటే కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను గెలిపించండి. అప్పుడే నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. 2014-19 మధ్య కాలంలో రాజంపేట నియోజకవర్గాన్ని రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశాం. ఆ తర్వాత వైకాపాను ఆదరించారు. భూభూకబ్జాదారుగా పేరొందిన ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి జగన్‌ టిక్కెట్‌ ఇచ్చారు. పూర్తి కథనం 

2. సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు

ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా రాజకీయ పార్టీలు.. నియోజకవర్గ ముఖ్యనేతలతో కలిపి నియోజకవర్గానికి, డివిజన్ల వారీగా విడివిడిగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని పార్టీలు బూత్‌ల వారీగా సైతం వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేశాయి. ఇక మహిళలు, యువత, ఆయా కుల, మత సంఘాలు ఎన్నికల ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తున్నాయి.పూర్తి కథనం 

3. మా కార్యకర్తలూ శక్తిమంతులే..

ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. భాజపా, భారాసపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పూర్తి కథనం 

4. అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!

ఏం చెబుతారండి పనికి రాని భూమి అంటూ ఉంటుందా...ఏదైనా భవనం నిర్మించి ఖాళీగా వదిలేస్తే ఏమవుతుంది. గబ్బిలాలు పడతాయి. అలాగే  ఆ భూమి కూడా సాగు చేయడంలేదు కాబట్టి అలా ఉంది. గతంలో అక్కడ పంటలు పండించేవారు. ఏవైనా వసతులు కావాలంటే సమకూరుద్దాం.. ఎమ్మెల్యే పేర్ని శాస్త్రవేత్తలకు వ్యగ్యంగా ఇచ్చిన సమాధానం.పూర్తి కథనం 

5. పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్‌ ఓటమికి శిలాఫలకాలు

జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్‌ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. భూ హక్కుదారులకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాసుపుస్తకాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. నారాయణ ఓ పొలంలో కూర్చుని భూరక్ష పథకంలోని లొసుగుల్ని వివరిస్తోన్న వీడియో సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.పూర్తి కథనం 

6. మీరూ వద్దు.. మీ డబ్బూ వద్దు!

సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నగరంలో బరిలో నిలిచిన అధికార పార్టీకి చెందిన నేత తాయితాల పంపిణీకి తెరలేపారు. ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి కథనం 

7. ఐటీనా.. అదెక్కడుంది..!

యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్‌ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్‌పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. వైకాపా పాలనలో విశాఖలోని పలు ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి పారిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. ఐటీ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చదువులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు.పూర్తి కథనం 

8. ఏడాది అన్నావ్‌... ఎడారి చేశావ్‌...!

‘అన్నమయ్య జలాశయం మట్టికట్ట వరదలకు తెగిపోవడం బాధాకరం. నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తాం. రాజంపేట నియోజకవర్గానికి సాగు, తాగునీరందిస్తున్న జలాశయాన్ని ఏడాదిలోనే మరో ఏడు టీఎంసీˆలు నీరు నిల్వ ఉండే విధంగా పునర్నిర్మిస్తాం’ అని జలాశయం కట్ట తెగిన సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన మాటిచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.పూర్తి కథనం 

9. శాసనసభా పక్ష నేత పదవి బీసీలకు ఎందుకివ్వలేదు?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే బలహీనవర్గాల(బీసీ)కు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభాపక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని.. దీనికి కారణమేమిటని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఓ లేఖలో ప్రశ్నించారు. భాజపా నేతలకు ఆయన రాసిన లేఖను శనివారం మీడియాకు విడుదల చేశారు. ‘‘మీరు గత పదేళ్లలో దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా?పూర్తి కథనం 

10. ఆరోగ్య బీమా మరింత భారం

పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుల నేపథ్యంలో బీమా సంస్థలు ప్రీమియాన్ని మరింత పెంచాలనే యోచనలో ఉన్నాయి.పూర్తి కథనం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు