‘ఖిలాడి’గా మాస్‌ మహారాజ్‌..! - RaviTeja New Movie First Look Out Now
close
Published : 18/10/2020 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖిలాడి’గా మాస్‌ మహారాజ్‌..!

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న కొత్త సినిమా ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం ఆదివారం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో రవితేజ క్లాస్‌+మాస్‌ లుక్‌లో సినీ ప్రియులను ఆకట్టుకునేలా కనిపించారు. రవితేజ 67వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో డింపుల్‌ హయాతీ, మీనా చౌదరి కీలకపాత్రలు పోషించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిచనున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్‌’ చిత్రంలో రవితేజ నటిస్తున్నారు. ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని