పెళ్లిపై కీర్తికి ఫ్యామిలీ నుంచి ఒత్తిడి? - Rumors On Keerthy Suresh Wedding
close
Updated : 30/12/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లిపై కీర్తికి ఫ్యామిలీ నుంచి ఒత్తిడి?

నటి ఏమన్నారంటే..

హైదరాబాద్‌: కరోనా సమయంలో పలువురు తారలు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా అగ్రకథానాయిక కీర్తి సురేశ్‌ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. కీర్తిసురేశ్‌కు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి జరగనుందంటూ ఈ ఏడాది ఆరంభంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవన్నీ అవాస్తవమని అప్పట్లో కీర్తి ఖండించారు. కాగా, తాజాగా కీర్తి పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి మరోసారి నెట్టింట్లో ప్రచారం మొదలైంది. త్వరలోనే కీర్తికి పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఈ మేరకు నటిపై ఒత్తిడి తీసుకువస్తున్నారట. దీంతో ఆమె.. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని.. ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి ఉంచానని కుటుంబసభ్యులతో చెప్పారట. ఈ మేరకు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పట్లో కీర్తి పెళ్లి లేనట్లే అని పేర్కొంటూ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు.

ప్రముఖ నటి మేనక కుమార్తెగా వెండితెరకు పరిచయమైన కీర్తిసురేశ్‌ తొలుత కొన్ని మలయాళీ సినిమాల్లో బాలనటిగా నటించారు. ‘ఇడు ఎన్నా మాయం’ అనే తమిళ చిత్రంలో తొలిసారి ఆమె కథానాయికగా నటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. తెలుగులో తెరకెక్కిన ‘నేను శైలజా’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి.. త్వరలో మహేశ్‌తో కలిసి ‘సర్కారువారి పాట’లో సందడి చేయనున్నారు.

ఇదీ చదవండి

రామోజీరావు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు: మయూరిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని