అది మాత్రం వద్దన్న సల్మాన్‌ ఖాన్‌ - Salman Khan avoiding birthday cake of his body guard
close
Updated : 13/12/2020 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది మాత్రం వద్దన్న సల్మాన్‌ ఖాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తన బాడీగార్డులలో ఒకరి బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న ఈ స్టార్‌ హీరో.. కేకు తినేందుకు మాత్రం నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. సల్మాన్‌ అంగరక్షకుల్లో ఒకరైన జగ్గీ జన్మదినం సందర్భంగా శనివారం విందును ఏర్పాటు చేశారు. దీనిలో సల్మాన్‌ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకును కోసిన జగ్గీ దానిని ఈ కండల వీరుడికి తినిపించబోయారు. మొదట దానిని తినేందుకు ముందుకు వచ్చిన సల్మాన్‌.. ఉన్నట్టుండి వద్దనేశాడు. ఈ చర్యతో అక్కడ ఉన్న జగ్గీ తదితరులు నవ్వుల్లో మునిగితేలారు.

సల్మాన్‌ ప్రస్తుతం బిగ్‌ బాస్‌ 14 రియాలిటీ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ఆయన తదుపరి చిత్రం ‘రాధే’ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రభుదేవా దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో దిశా పటానీ నాయికగా మెరవనున్నారు. సల్మాన్‌ మరో చిత్రం ‘అంతిమ్‌’ షూటింగ్‌ జరుగుతోంది. దీనిలో సల్మాన్‌ సిక్కు వ్యక్తి గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో తన చెల్లి అంకిత భర్త ఆయుష్‌ శర్మతో కలసి తొలిసారి నటించనుండటం మరో విశేషం.

ఇవీ చదవండి..

సన్నీ, ఇమ్రాన్‌ హష్మీ ఇతడి తల్లిదండ్రులట!

ఆర్మీ దుస్తుల్లో ఎవరబ్బా..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని